Saturday, April 20, 2024

రెండురోజుల్లో ప్యార్ లోన పాగ‌ల్ సాంగ్ కి.. 3మిలియ‌న్ ప్ల‌స్ వ్యూస్

రెండు రోజుల్లో రావణాసుర సినిమాలోని ప్యార్ లోన పాగ‌ల్ సాంగ్ కి 3మిలియ‌న్ ప్ల‌స్ వ్యూస్ వ‌చ్చాయి. ప్రేమించిన అమ్మాయి తనని మోసం చేసి వెళ్లిపోయిందంటూ హీరో తన గోడును వెళ్లబోసుకునే పాట ఇది.మాస్ మ‌హ‌రాజ్ రవితేజ పాడిన ఈ పాటను హీరో బృందంపై చిత్రీకరించారు. ఈ పాటను ఇలా వదిలారో లేదో అలా దూసుకుపోతోంది. 3 మిలియన్ ప్లస్ వ్యూస్ ను కొల్లగొట్టేసింది. రవితేజ గానం .. ఆయన మాస్ స్టెప్పులు ఈ పాటకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి.అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లో సుధీర్ వర్మ రూపొందించిన ఈ సినిమాను, ఏప్రిల్ 7వ తేదీన విడుదల చేయనున్నారు.ఈ చిత్రంలో రవితేజ సరసన ఐదుగురు హీరోయిన్స్ సందడి చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement