Wednesday, April 24, 2024

కొత్త యాడ్ లో ఎన్టీఆర్.. వైరల్ గా మేకింగ్ వీడియో

ఎటువంటి డైలాగ్ అయినా సింగిల్ టేక్ లో అవలీలగా చెబుతుంటాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ . తాజాగా మరోసారి ఓ యాడ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఈ స్టార్ హీరో. ఈ యాడ్ కు సంబంధించిన షూటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ యాడ్ లో తారక్ సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఈ యాడ్ లో కోర్ట్ సీన్ ను తెరకెక్కించారు. అయితే దీనిలో ఒక చిన్న డైలాగ్ చెప్పాల్సి ఉంటుంది.. కానీ తారక్ చాలా టెక్స్ తీసుకుంటారు. దాంతో ఎదురుగా ఉన్న రాహుల్ రామకృష్ణ ఆరు పేజీల డైలాగ్ ను సింగిల్ టెక్ లో చెప్తారు. ఈ చిన్న డైలాగ్ చెప్పలేక పోతున్నారేంటి అని ప్రశ్నిస్తాడు..దానికి తారక్.. ‘‘చేప చిన్నదే అయినా ఎర పెద్దది వెయ్యాలి’’ అని డైలాగ్ చెప్తారు. ఆతర్వాత డైలాగ్ చిన్నదే అయినా.. డైలెక్ట్ పర్ఫెక్ట్‌గుండాలి’’.. అంటూ తారక్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ఇక ఈ యాడ్ మేకింగ్ వీడియో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement