Friday, March 29, 2024

కంటి వెలుగు పథకంలో.. కోటి 58లక్షలను మించిన పరీక్షలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి 58లక్షల 35వేల 947 మందికి కంటి పరీక్షలు పూర్తి చేశారు. దృష్టి లోపం ఉన్నవారిని గుర్తించి 22లోల 21వేల 494 మందికి ఉచితంగా కళ్లద్దాలు, ఔషదాలను అందజేశారు. ఇందులో 74లక్షల 42వేల435 మంది పురుషులు, 83లక్షల 73వేల 097 మంది స్త్రీలు, 10,955 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. కోటి 18లక్షల 26వేల 614 మందికి ఎలాంటి కంటి సమస్యలు లేవని నిర్ధారణ చేశారు.

తెలంగాణలో ఏ వ్యక్తితో వ్యక్తి కంటి సమస్యతో బాధపడకూడదని కంటి వెలుగు పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మారిన జీవన విధానం, వివిధ రకాల పనిఒత్తిళ్ల కారణంగా కంటి సమస్యలు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సమస్యను గుర్తించిన సీఎం కేసీఆర్‌ రెండో విడత కంటి వెలుగు పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది జనవరి 18 నుంచి జూన్‌ 15 వరకు వంద రోజుల కార్యక్రమంగా చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement