Thursday, April 25, 2024

హిందూమహాసముద్రంలో.. మూడుదేశాల నౌకా దళాల కార్యాచరణ

న్యూఢిల్లీ: హిందూమహాసముద్ర జలాల్లో మరింత రక్షణ, భద్రత లక్ష్యంగా సంయుక్త నావికా విన్యాసాలు నిర్వహించాలని నిర్ణయించిన భారత్, శ్రీలంక, మాల్దీవులు రంగంలోకి దిగాయి.శని, ఆదివారాల్లో నావికాదళాలు విన్యాసాల్లో పాల్గొన్నాయి. కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్ గా పేర్కొన్న ఈ కార్యక్రమంలో ప్రధాన ఉద్దేశం హిందూ సముద్ర జలాల మీదుగా వెళ్లే నౌకలకు మరింత భద్రత కల్పించడం. అలాగే దక్షిణ అరేబియా సముద్రంలో మూడు దేశాల పరిథిలోకి వచ్చే ఎక్స్కూజివ్ ఎకనమిక్ జోన్ పరిథిలోకి వచ్చే జలాల్లోనూ నిఘా వేశాయి.

గత జులైలో త్రైపాక్షిక కార్యక్రమంలో భాగంగా టేబుల్ టాప్ ఎక్సర్ సైజ్ పేరిట ఈ తరహాలో సంయుక్త విన్యాసాలు నిర్వహిచాయి. ప్రత్యేకించి హిందూ మహాసముద్రంలో ప్రమాదాలు, విపత్తులు ఎదురైనప్పుడు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పరప్పరం సహకరించుకునే లక్ష్యంతో గత ఆగస్టులు ఈ మూడు దేశాల భద్రతా సలహాదార్ల సమావేశం నిర్వహించారు. హిందూ సముద్ర జలమార్గాల్లో నేరాలను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపైనా ఈ మూడు దేశాలు దృష్టి సారించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement