Tuesday, March 26, 2024

ఆఫ్రికా అడ‌వుల్లో.. భార‌తీయుడు2

స్టార్ హీరో క‌మ‌ల్ హాస‌న్ విక్ర‌మ్ సినిమా హిట్ట్ త‌ర్వాత ప‌లు ప్రాజెక్టుల‌ను సెట్స్ పైకి తీసుకెళ్తున్నారు.వాటిల్లో ఒక‌టి భార‌తీయుడు2. ఏపీలో షూటింగ్ జ‌రుగుతోంది. కాగా ఈ చిత్ర టీం షూటింగ్ కోసం ఆఫ్రికా అడవుల‌కి ప‌య‌నం కానుంద‌ట‌. కాగా ఈ మేర‌కు అన్ని ఏర్పాట్లు చేయనున్నట్టు సమాచారం. అంతే కాదు భారీ లాంగ్ షెడ్యూల్ ను ఆఫ్రికాలో ప్లాన్ చేశారట చిత్ర టీమ్. ఈ షెడ్యూల్ దాదాపు 15 రోజులు జరగనున్నట్టు సమాచారం. ఇండియన్ 2 సినిమాలో విశ్వ‌న‌టుడు కమల్ హాసన్ తో పాటు హీరోయిన్ కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, బాబీ సింహ.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇండియన్ 2 సినిమాని 2023 చివరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.1996లో తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా భారతీయుడు సినిమా వచ్చింది. దాదాపు 26 సంవత్సరాల తర్వాత 2022 లో ఈ సినిమాకి సీక్వెల్ మొదలుపెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement