Wednesday, March 29, 2023

స్వచ్ఛ సర్వేక్షణ్‌ లో.. ఖమ్మం ఫస్ట్..

  • హర్షం వ్యక్తం చేసిన మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్‌
  • కృషి చేసిన అధికారులు, ప్రజా ప్రతినిధులను అభినందించిన మంత్రి

ఖమ్మం : స్వచ్ఛ సర్వేక్షణ్‌’లో దేశంలోనే ఖమ్మం ఫస్ట్‌ ప్లేస్ దక్కటంపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ ర్యాంకింగుల్లో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు సత్తాచాటాయని అన్నారు. కేంద్ర జలశక్తి శాఖ.. దేశ వ్యాప్తంగా మొత్తం 44 పట్టణాలకు త్రీస్టార్‌ రేటింగ్‌ ఇవ్వగా.. అందులో 187.35 శాతం మార్కులతో ఖమ్మం జిల్లా దేశంలోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. 122.57 మార్కులతో భద్రాద్రి జిల్లా ఐదోస్థానంలో నిలిచిందని, స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఖమ్మం జిల్లాకు ప్రథమ స్థానం రావడం పట్ల జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. మరుగుదొడ్ల నిర్మాణం, గ్రామ పంచాయతీల నిర్వహణలో ఖమ్మం జిల్లా దేశంలోనే ఆదర్శంగా నిలవడం గర్వంగా ఉందన్నారు.
గతేడాది డిసెంబర్‌ 1వ తేదీ వరకు ఉన్న గణాంకాల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం 2023 స్వచ్ఛసర్వేక్షణ్‌ ర్యాంకులను బుధవారం ప్రకటించింన నేపథ్యంలో ఖమ్మంకు చోటు దక్కడం అధికారులు, సిబ్బంది కృషి పట్ల మంత్రి వారిని అభినందించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement