Saturday, April 20, 2024

పెద్ద‌మ్మ‌త‌ల్లి ఆల‌యంలో.. శాకుంత‌లం టీం

పెద్ద‌మ్మ త‌ల్లి ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు శాకుంత‌లం మూవీ టీం.ఈ నేపథ్యంలోనే పెద్దమ్మతల్లిని ఆ సినిమా యూనిట్ దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసింది. హీరోయిన్ సమంతతో పాటు డైరెక్టర్ గుణశేఖర్, ప్రొడ్యూసర్ నీలిమ, దేవ్ మోహన్ లు కూడా ఉన్నారు. ఈ చిత్రంలో మలయాళీ హీరో దేవ్ మోహన్ కీలకపాత్రలో నటించారు. ప్రకాశ్ రాజ్, అదితి బాలన్, మోహన్ బాబు, మధుబాల, అనన్య నాగళ్ల, గౌతమి తదితరులు కీలక పాత్రలలో నటించారు. అంతేకాదు.. ఈ సినిమాలో తొలిసారిగా అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ బాలనటిగా కనిపించిందని సమాచారం. శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement