Wednesday, December 11, 2024

J & K : క‌శ్మీర్ లో ఉగ్ర ఘాతుకం.. ఇద్ద‌రు విలేజ్ డిఫెన్స్ గార్డుల కాల్చివేత

  • నిన్న ఆ ఇద్ద‌రిని కిడ్నాప్ చేసిన ఉగ్ర‌వాదులు
  • ఆ తర్వాత వాళ్ళ క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టి కాల్చివేత‌
  • మృత‌దేహాలు రోడ్డుపై విసిరివేత


జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోమారు తెగబడ్డారు. కిష్త్‌వర్‌ జిల్లాలో ఇద్దరు విలేజ్ డిఫెన్స్ గార్డులను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు అనంతరం వారిని కాల్చి చంపారు. అధ్వారీలోని ముంజ్లా ధర్ అడవీ ప్రాంతంలో నజీర్ అహ్మద్, కుల్దీప్ కుమార్‌ను నిన్న కిడ్నాప్ చేసిన ముష్కరులు వారిని కాల్చి చంపారు. తీసుకెళ్లిన ఆ ఇద్ద‌రి క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టి అనంత‌రం తుపాకీతో కాల్చి చంపారు.. వారి శవాల‌ను రోడ్డుపై ప‌డేశారు.

విష‌యం తెలుసుకున్న పోలీసులు వారి మృత‌దేహ‌ల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే విలేజ్ డిఫెన్స్ గార్డులను కిడ్నాప్ చేసి, హత్య చేసింది తామేనని జైషే-ఈ-మహమ్మద్ అనుబంధ సంస్థ కశ్మీర్ టైగర్స్ ప్రకటించింది. కళ్లకు గంతలతో ఉన్న మృతదేహాల ఫొటోలను విడుదల చేసింది. ఈ ఘాతుకాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు.

ఇక.. గ్రామ రక్షణ కమిటీలను జమ్మూకశ్మీర్‌ పోలీసులు ఏర్పాటు చేసి స్థానికులకు ఆయుధ శిక్షణ ఇస్తున్నారు. తద్వారా ఉగ్రవాదుల నుంచి వారు గ్రామాలను రక్షించుకోవాలన్నది లక్ష్యం. ఇక వారిని చంపిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement