Saturday, April 17, 2021

ఒక్క రోజులో కామారెడ్డిలో 263 పాజిటివ్ కేసులు….బిగ్ బ్రేకింగ్

తెలంగాణలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. దీనితో అధికారులు ఆంక్షలను కఠినతరం చేస్తున్నారు. అయితే తాజాగా తెలంగాణ కామారెడ్డి జిల్లాలో మహమ్మారి జూలు విదిల్చింది. ఒకే రోజు 263 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 1920 మందికి కరోనా పరీక్షలు చేయగా 263 కేసులు నిర్ధారణ అయ్యాయి.

ఈ కేసుల్లో అత్యధికంగా డొంగ్లి పి.హెచ్.సిలో 64, బీర్కూర్ 32, జిల్లా ఆస్పత్రి 27, బాన్సువాడ ఆస్పత్రిలో 24 కేసులు నమోదు అయ్యాయి. వీటితో క‌లిపి జిల్లా వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన కేసులు సంఖ్య మొత్తం 14,880కి పెరిగింది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికక్కడే…కొన్ని ఊర్లలో సెల్ఫ్ లాక్ డౌన్ పెట్టుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Prabha News