Thursday, April 25, 2024

హెమరేజిక్‌ సెప్టిసెమియా వ్యాక్సిన్‌ కోసం ఐఐఎల్‌ ఒప్పందం

హైదరాబాద్‌: సుప్రసిద్ధ వ్యాక్సిన్‌ తయారీదారు ఇండియన్‌ ఇమ్యునోలాజికల్స్‌ లిమిటెడ్‌ (ఐఐఎల్‌), తాము ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ (ఐసీఏఆర్‌) ఇనిస్టిట్యూట్‌ సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్రెష్‌ వాటర్‌ ఆక్వాకల్చర్‌ (సీఐఎఫ్‌ఏ)తో భాగస్వామ్యం చేసుకుని, హెమరేజిక్‌ సెప్టిసెమియాకు వ్యతిరేకంగా వ్యాక్సిన్‌లను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించింది. ఈ హెహమరేజిక్‌ సెప్టిసెమియాను ఏరోమానస్‌ సెప్టిసేమియా, అల్సర్‌ డిసీజ్‌ లేదా రెడ్‌ సోర్‌ డిసీజ్‌గా కూడా వ్యవహరిస్తారు. అక్టోబర్‌ 2022లో ఆక్వా వ్యాపారంలోకి అడుగు పెట్టిన ఐఐఎల్‌, ఆక్వాకల్చర్‌ హెల్త్‌ మార్కెట్‌ కోసం ఉత్పత్తులు విడుదల చేసింది.

చెరువుల నిర్వహణ, చేప, రొయ్యల ఆరోగ్య నిర్వహణకు ఈ ఉత్పత్తులను ఉపయోగించవచ్చు. ఐసీఏఆర్‌, సీఐఎఫ్‌ఏ భాగస్వామ్యంతో కలిసి మంచినీటి చెరువు చేపల కోసం వ్యాక్సిన్‌లను ఉత్పత్తి చేసింది. భారత ఆర్థిక వ్యవస్థలో ఆక్వారంగం అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఈ రంగంతో పాటు ఫిషరీస్‌ రంగంపై దాదాపు 28 మిలియన్‌ మంది తమ జీవనోపాధి కోసం ఆధారపడి ఉన్నారు. వ్యాక్సిన్‌ విడుదల సందర్భంగా ఇండియన్‌ ఇమ్మునోలాజికల్స్‌ ఎండీ డాక్టర్‌ కే.ఆనంద్‌ కుమార్‌ మాట్లాడుతూ, షిఫ్‌ వ్యాక్సిన్‌లను భారత్‌లో రూపొందించిన సంస్థగా ఐఐఎల్‌ ఖ్యాతి పొందిందన్నారు.

- Advertisement -

దేశంలో వ్యాక్సిన్‌లను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడం కోసం కృషి చేస్తున్నామన్నారు. ఒన్‌ హెల్త్‌ కార్యక్రమంలో భాగంగా పర్యావరణంలో యాంటీ మైక్రోబయాల్‌ రెసిస్టెన్స్‌ తగ్గించడం కోసం యాంటీ బయాటిక్స్‌ వినియోగం తగ్గించే దీర్ఘకాల లక్ష్యంతో మత్య్స రంగానికి సైతం వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేయడానికి ఐఐఎల్‌ కట్టుబడి ఉందని సంస్థ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రియబాత్రా పట్నాయక్‌ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement