Sunday, April 2, 2023

ఉత్తమ సేవలందిస్తే గుర్తింపు పొందుతారు.. పెద్దపల్లి ఏసీపీ సారంగ పాణి

ప్రభుత్వ అధికారులు ఉత్తమ సేవలందిస్తే గుర్తింపు పొందుతారని పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి అన్నారు. మంగళవారం రాత్రి పెద్ద‌ప‌ల్లి నుంచి బదిలీపై వెళ్తున్న సారంగపాణికి వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ 20నెలల పాటు పెద్దపల్లి లో పనిచేసే అవకాశం రావడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత ఉత్తమ సేవలు అందించాలని సూచించారు.

- Advertisement -
   

బదిలీపై వెళ్తున్న సారంగ‌పాణిని డీఎఫ్ఓ శివయ్య, ఇన్‌స్పెక్ట‌ర్లు ప్రదీప్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, అనిల్ కుమార్, ఎస్సైలు రాజేష్, మహేందర్, శ్రీనివాస్, ఉపేందర్, వెంకటకృష్ణ, వర్ధన్, వెంకట్, శ్రీనివాస్, మౌనిక, వినిత, సహదేవ్ సింగ్, అశోక రెడ్డితోపాటు సిబ్బంది శాలువాలు క‌ప్పి, పుష్ప గుచ్ఛాలు అందించి ఘనంగా సన్మానించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement