Wednesday, April 24, 2024

మద్యం తాగి వాహనాలు నడిపితే జైలుకే.. ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి

మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానాలతో పాటు జైలు శిక్ష తప్పదని పెద్దపెల్లి సిఐ ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం రాత్రి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నిట్టూరు రోడ్ లో బ్రీత్ అనలైజర్ల ద్వారా పరీక్షలు నిర్వహించి మద్యం సేవించిన వారి వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. ధ్రువీకరణ పత్రాలు లేని వారికి జరిమానాలు విధించారు.

అనంతరం సిఐ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. పెద్దపల్లి సర్కిల్ పరిధిలో ప్రతినిత్యం వాహనాలు తనిఖీచేబడుతున్నామని, వాహనదారులు తప్పనిసరిగా ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలన్నారు. తనిఖీల్లో ఎస్ఐలు రాజేష్, సహదేవ్ సింగ్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement