Tuesday, April 16, 2024

మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. ట్యాంక్ బండ్ పై కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం.. బండి సంజయ్

సినీ రంగానికి కృష్ణ చేసిన సేవలు చాలా గొప్పవని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆయన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు. తెలుగు సినిమాకు హంగులు దిద్దిన నటుడు సూపర్ స్టార్ కృష్ణ అని అన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంతేకాదు, కృష్ణకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చే విషయమై కూడా బీజేపీ తరపున కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement