Monday, April 15, 2024

100 కోట్లిస్తే రాజ్యసభ సీటు.. గవర్నర్‌ పదవైనా ఇప్పిస్తాం, సీబీఐ అధికారులుగా బెదరింపులు

కేంద్రప్రభుత్వంలో తమకు అపారమైన పరపతి ఉందని, రూ.100 కోట్లు ఇస్తే రాజ్యసభ సీటు లేదా గవర్నర్‌ పదవి ఇప్పించడానికి సిద్ధమని నమ్మబలికి, కొందరి నుంచి పెద్ద మొత్తాలను వసూలు చేసిన ఘరానా ముఠాను సీబీఐ అరెస్టు చేసింది. కొన్నివారాల పాటు నిందితుల ఫోన్‌ సంభాషణలపై ఒక చెవిపెట్టి నిఘా ఉంచిన సీబీఐ చివరకు చెల్లింపులు జరిగిన వెంటనే అరెస్టు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఎఫ్‌ఐఆర్‌లోని అంశాలు బయటకు పొక్కాయి. ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన కర్మలాకర్‌ ప్రేమ్‌కుమార్‌ బండ్గార్‌, కర్నాటకకు చెందిన రవీంద్ర విఠల్‌ నాయక్‌, ఢిల్లిdకి చెందిన మహేంద్ర పాల్‌ అరోర, భిషేక్‌ బూరలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ నలుగురు ఒక ముఠాగా ఏర్పడి ఆశావహులను గుర్తించి వారిని నమ్మించేవారు.

రాజ్యసభ సీటు లేదా గవర్నర్‌ గిరీ, కనీసం కేంద్రప్రభుత్వ సంస్ధకు చెందిన సంస్థల్లో చైర్మన్‌లుగా నియమిస్తామని నమ్మబలికేవారు. కేంద్రప్రభుత్వంలోని అత్యున్నత అధికార వర్గాలతో సంబంధాలున్న బండ్గార్‌ను పావుగా చేసి అభిషేక్‌ బూర నమ్మించేవారని సీబీఐ గుర్తించింది. బండ్గార్‌ తనకు తానుగా సీబీఐ అధికారిగా చెప్పుకునేవారు. మరో నిందితుడు మహమ్మద్‌ ఐజాజ్‌తో కలసి అక్రమాలకు పాల్పడేవారు. ఆయా పదవులకోసం వెంపర్లాడేవారిని నమ్మించడానికి పెద్ద పదవుల్లో ఉన్న రాజకీయ నేతలు, అధికారుల పేర్లను ప్రస్తావిస్తూ వారితో తమకు మంచి సంబంధాలున్నట్లు చెప్పేవారని సీబీఐ గుర్తించింది. కొన్ని సందర్భాలలో పోలీసు ఉన్నతాధికారులను కూడా వీరు బెదరించేవారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement