Wednesday, April 24, 2024

ఐసీసీ టెస్టు ర్యాంకులు: రెండో స్థానానికి దూసుకెళ్లిన జడేజా

ఐసీసీ బుధవారం విడుదల చేసిన టెస్టు ర్యాంకుల్లో టీమిండియా ఆల్‌రౌండర్‌ స్టార్‌ రవీంద్ర జడేజా దూకుడుమీదున్నాడు. ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌‌ను వెనక్కి నెట్టి జడ్డూ రెండో ర్యాంకు ఎగబాకాడు. 386 రేటింగ్‌ పాయింట్లతో ఉన్న రవీంద్ర జడేజా ర్యాంకింగ్స్‌లో సూపర్ వేగంతో దూసుకొస్తున్నాడు. 385 పాయింట్లతో ఉన్న ఇక ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌‌ను వెనక్కి నెట్టి జడ్డూ రెండో ర్యాంకు సాధించాడు. టెస్టు ఆల్‌రౌండర్ల జాబితాలో వెస్టిండీస్‌ క్రికెటర్‌ జేసన్‌ హోల్డర్‌ 423 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టు బౌలర్ల జాబితాలో రవిచంద్రన్‌ అశ్విన్‌ సెకండ్‌ ర్యాంకు నిలబెట్టుకున్నాడు.

ఈ ఏడాది ఆరంభంలో మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన 3 వ టెస్టులో రవీంద్ర జడేజా చేతికి గాయం కావడంతో టెస్ట్ క్రికెట్ ఆడలేదు. అతను స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన 4-టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు, చివరి 3 టెస్టుల్లో అక్సర్ పటేల్ చోటు దక్కించుకున్నాడు. మరోవైపు ఐసీసీ టెస్టు బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో ముగ్గురు భారత ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(814 పాయింట్లు), రిషబ్‌ పంత్‌(747), రోహిత్‌ శర్మ(747) వరుసగా 5,6,7 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ జాబితాలో నంబర్‌వన్‌ బ్యాట్స్‌మన్‌గా ఉన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement