Tuesday, April 23, 2024

బెయిర్‌స్టోకు ఐసీసీ అవార్డు.. న్యూజిలాండ్‌, ఇంగ్లండ్ మ్యాచ్‌లో గ్రేట్ ప‌ర్ఫామెన్స్‌

”ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది జూన్‌ మంత్‌” అవార్డులను సోమవారంనాడు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ప్రకటించింది. ఇంగ్లండ్‌ దిగ్గజ క్రికెటర్‌ జానీ బెయిర్‌స్టోకు ”ఐసీసీ మెన్స్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది అవార్డు” లభించింది. మహిళల విభాగంలో దక్షిణాఫ్రికా స్టార్‌ మారిజాన్‌ కాప్‌ పురస్కారం అందుకున్నారు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ల్లో అదరగొట్టిన మారిజాన్‌ కాప్‌కు అవార్డు వరించింది. స్వదేశంలో న్యూజిలాండ్‌, టీమిండియాతో టెస్టు మ్యాచ్‌ల్లో బెయిర్‌స్టో అదరగొట్టిన విషయం తెలిసిందే.

న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా జో రూట్‌, బెయిర్‌ స్టో అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. జట్టుకు అవసరమైన సమయంలో రాణించి సిరీస్‌ గెలవడంలో తమ వంతు పాత్ర పోషించారు. ముఖ్యంగా రెండో టెస్టులో ఆఖరి రోజు ఆటలో భాగంగా బెయిర్‌ స్టో 136 పరుగులతో రాణించడం విశేషం. దీంతో 5 వికెట్ల తేడాతో ఆతిథ్య ఇంగ్లండ్‌ విజయం సాధించింది. బెయిర్‌స్టో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement