నా దేవుడిని కలిశానని ట్వీట్ చేశారు దర్శకుడు రాజమౌళి. హాలీవుడ్ దర్శక దిగ్గజం స్టీవెన్ స్పిల్ బర్గ్ ను కలిశారు రాజమౌళి. స్పిల్ బర్గ్ ను వీరు కలవడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా వీరు కాసేపు మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను రాజమౌళి ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇప్పుడే దేవుడిని కలిశానని ఆయన ట్వీట్ చేశారు.తాజాగా యూనివర్సల్ పార్టీలో రాజమౌళి, కీరవాణి పాల్గొన్నారు.
ఆస్కార్ అవార్డుల ఓటింగ్ లో భాగంగా లాస్ ఏంజెలెస్ లోని సన్ సెట్ టవర్స్ లో యూనివర్సల్ పార్టీ నిర్వహించారు. హాలీవుడ్ సెలెబ్రిటీలందరూ ఈ పార్టీకి హాజరయ్యారు. స్పిల్ బర్గ్ సినిమాలంటే తనకు ఎంత ఇష్టమో ఆయనకు చెప్పానని కీరవాణి తెలిపారు. ‘నాటునాటు’ పాట ఎంతో నచ్చందని స్పిల్ బర్గ్ చెప్పిన మాటలను తాను ఇంకా నమ్మలేకపోతున్నానని చెప్పారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమం కోసం దర్శకధీరుడు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తదితరులు కుటుంబ సమేతంగా అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే.