Wednesday, February 8, 2023

నాకే ర‌క్ష‌ణ లేదు.. సాధార‌ణ మ‌హిళ‌ల ప‌రిస్థితి ఏంటీ.. ట్వీట్ చేసిన ఢిల్లీ కమిషన్ ఫర్ విమెన్ చీఫ్

ఢిల్లీలో మ‌హిళ‌ల ర‌క్ష‌ణ ఎలా ఉందో ప‌రిశీలించాల‌ని ఢిల్లీ కమిషన్ ఫర్ విమెన్ చీఫ్ స్వాతి మాలివాల్ నిర్ణ‌యించుకున్నారు. దాంతో తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ఆమె తన టీమ్‌తో కలిసి ఎయిమ్స్ సమీపంలోకి వెళ్లారు. అప్పుడే మద్యం మత్తులో కారులో వచ్చిన ఓ వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడు. కారులో ఉన్న అతన్ని కిటికీ గుండా గట్టిగా పట్టుకున్నారని వివరించారు. కానీ, కారు అద్దాలు క్లోజ్ చేయడంతో తన చేతిని ఇరికించేశారని తెలిపారు. అప్పుడు సుమారు 15 మీటర్లు ఆ కారు వెంటే పరుగెత్తానని, దాదాపు తనను ఈడ్చుకెళ్లినంత పని చేశాడని ఆరోపించారు. ఆ దేవుడే తన ప్రాణాలు రక్షించాడని వివరించారు. ఢిల్లీలో ఒక మహిళా కమిషన్ చైర్మన్ పరిస్థితే ఇలా ఉంటే… సాధారణ మహిళ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి అని ట్వీట్ చేశారు. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి కారును సీజ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement