Thursday, October 3, 2024

HYDRAA – కావూరి హిల్స్‌ లో ఆక్రమణలు కూల్చివేతలు ప్రారంభం

హైదరాబాద్ – నగరంలో ఆక్రమణల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మాదాపూర్‌లో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. కావూరి హిల్స్‌ పార్క్‌ ప్రాంతంలో ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు.

హైడ్రా అధికారులు, పోలీసులు.. సోమవారం ఉదయమే కావూరి హిల్స్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో కావూరి హిల్స్‌లో పార్క్‌ను ఆక్రమించి అక్రమంగా నిర్మించిన జిమ్‌ను అధికారులు కూల్చివేశారు. ఇక, పార్క్‌ స్థలంలో అక్రమంగా నిర్మించిన జిమ్‌కు అధికారులు ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చారు. అధికారుల నోటీసులను జిమ్‌ నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో తాజాగా కూల్చివేతలు ప్రారంభించారు. కోర్టు ఆదేశాలతోనే హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నట్టు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement