Saturday, April 20, 2024

వెర్రి పలురకాలు: లైకుల కోసం పామునే కరకర కొరికి తినేశాడు..

సోషల్‌ మీడియాలో క్రేజ్ సంపాదించుకోవడానికి కొందరు ఎంతకుబడితే అంతకు తెగిస్తున్నారు. తాము మనుష్యులము అన్న విషయమే మరచిపోయి జంతువులాగా ప్రవర్తిస్తున్నారు కొందరు. అసలేంజరిగిందంటే..హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ యువకుడు సోషల్ మీడియాలో ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌ హైదరాబాద్‌ వెర్షన్‌’ పేరుతో ఏకంగా బతికున్న పామునే తిన్నాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. తొలుత పాముపిల్ల తలను నోట్లో పెట్టుకున్న యువకుడు.. కొంచెంకొంచెంగా తోక చివరి వరకు నమిలి మింగాడు. ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ పాము మెలికలు తిరుగుతూ గిలగిల్లాడింది. ‘అరేయ్‌ సాజిద్‌.. నీళ్ల బాటిల్‌ తీసుకురా..!’ అంటూ ఆ యువకుడు మిత్రులను ఆదేశించడం వీడియోలో వినిపిస్తోంది. దీనిపై జంతుప్రేమికులు మండిపడుతున్నారు. సదరు యువకుడిని పట్టుకుని శిక్షించాలని బుధవారం డీజీపీ, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కు ట్విట్టర్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. గతంలో కుక్కలను భవనం పైనుంచి విసిరేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో సదరు యువకుడిని పోలీసులు పట్టుకున్నారు.

ఇది కూడా చదవండి: Third Wave: చిన్నారులపై ప్రభావం ఆరు రోజులే..!

Advertisement

తాజా వార్తలు

Advertisement