Saturday, April 20, 2024

హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ లో.. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మ

హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో నవంబర్ 27న దివంగత నటుడు.. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మ జ‌ర‌గ‌నుంది. పెద్ద కర్మ రోజున అభిమానులను మహేశ్ బాబు కలవాలనుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ మహేశ్ బాబుతో పాటు ఆయన చిన్నాన్న ఆదిశేషగిరిరావు, ఇతర కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. కాగా ఈ కార్యక్రమానికి కృష్ణ, మహేశ్ బాబు అభిమానులను కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు. కృష్ణ అంత్యక్రియల రోజు ఆయనను చివరిసారిగా చూసుకునేందుకు ఎక్కడెక్కడి నుంచో అభిమానులు పద్మాలయా స్టూడియోస్ కు వచ్చారు. అయితే చాలా మంది ఆయనను కడసారి చూసుకోలేకపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement