Saturday, April 20, 2024

Hyderabad | వీధి కుక్కల నియంత్రణకు యాక్షన్​ ప్లాన్​.. అన్ని స్కూళ్ల దగ్గర హెల్ప్​లైన్​ నెంబర్​

హైదరాబాద్​ మహానగరంలో మొన్న బాలుడిని కుక్క కరిచి చంపేసిన ఘటనపై జీహెచ్​ఎంసీ అధికారులు సీరియస్​ యాక్షన్​ తీసకుంటున్నారు. ఈ మేరకు ఇవ్వాల ప్రత్యేక సమావేశం నిర్వహించి స్ట్రీట్​ డాగ్స్​ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అంతేకాకుండా అన్ని స్కూళ్ల వద్ద హెల్ప్​ లైన్​ నెంబర్​ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

పదుల సంఖ్యలో ఉంటూ.. మనిషి కనిపించగానే రెచ్చిపోతున్న స్ట్రీట్ డాగ్స్​ని ఎట్లా కంట్రోల్​ చేయాలనేదానిపై అధికారులు ఆలోచన చేస్తున్నారు. ఇవ్వాల (బుధవారం) గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ (జీహెచ్​ఎంసీ), మున్సిపల్​ అడ్మినిస్ట్రేషన్​ విభాగాల అధికారులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.  వీధికుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు చనిపోయిన నేపథ్యంలో ఈ ముప్పును ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చించారు.

ఈ సందర్భంగా MA&UD స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఓ ట్వీట్​ చేశారు. యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC), రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్‌లు (RWA), వీధి కుక్కలతో వ్యవహరించే తీరుపై ఆయన దీనిలో తెలియజేశారు. మహానగరంలోని అన్ని పాఠశాలల వద్ద హెల్ప్ లైన్ నంబర్ (040 21111111)- బోర్డు పెట్టాలని సూచించారు. వీధి కుక్కలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి, తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న గంగాధర్‌తో పాటు ప్రదీప్ అనే బాలుడు వెళ్లగా.. మొన్న ఓ వీధి కుక్క అతడిని కరిచి చంపేసింది. ఈ సంఘటన గురించి అధికారి గంగాధర్ వివరిస్తూ ఆదివారం తనతో పాటు తన కొడుకు కూడా పనికి వచ్చాడని.. బయట తిరుగుతుండగా వీధికుక్కలు తనపై దాడి చేశాయని తెలిపారు. కొంతమంది స్థానికులు ప్రదీప్‌ను రక్షించడానికి ఆసుపత్రికి తీసుకెళ్లారని, అయినా బాలుడు చనిపోవడం దురదృష్టకరమన్నారు.

- Advertisement -

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో కృషి చేస్తామని రాష్ట్ర ఎంఏ అండ్ యూడీ మంత్రి కేటీ రామారావు మంగళవారం రాష్ట్ర ప్రజలకు తెలిపారు. “మేము మా మున్సిపాలిటీలలో వీధి కుక్కల బెడదను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం. జంతు సంరక్షణ కేంద్రాలు, జంతు జనన నియంత్రణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. చనిపోయిన బాలుడి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాగా పనిచేస్తామని ప్రామిస్​  చేస్తున్నా”అని BRS పార్టీ ముఖ్య నేత, మంత్రి కేటీఆర్​ మీడియాకు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement