Thursday, April 25, 2024

వందేభారత్‌ రైళ్ల తయారీకి హైదరాబాద్‌ కంపెనీ బిడ్‌

వందేభారత్‌ రైళ్లను అల్యూమినియం బాడీతో తయారు చేసుందుకు రెండు కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి. ఇందులో హైదరాబాద్‌కు చెందిన మేధా సర్వో డ్రైవ్స్‌ కంపెనీ ఉంది. ఈ కంపెనీ స్విట్జర్లాండ్‌కు చెందిన స్టర్లర్‌ కంపెనీతో కలిసి బిడ్‌ దాఖలు చేసింది. ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ రైల్వే కంపెనీ ఆల్‌స్తోమ్‌ రెండో కంపెనీ. 30,000 కోట్ల విలువైన కాంట్రాక్ట్‌ కోసం ఈ కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి. ఈ కాంట్రాక్ట్‌ కింద 100 వందేభారత్‌ రైళ్లను తయారు చేసి, 35 సంవత్సరాల పాటు వాటిని నిర్వహణ బాధ్యతలు చూడాల్సి ఉంటుంది. ఉక్కుతో రూపొందిస్తున్న రైళ్లతో పోల్చితే అల్యూమినియం రైళ్లు తేలికగా ఉండటం వల్ల ఎక్కువ ఇంథన సామర్ధ్యాన్ని ఇస్తాయి.

ప్రస్తుతం వందేభారత్‌ రైళ్లు సిటింగ్‌తోనే వస్తున్నాయి. 2024 నాటికి వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లను తీసుకురావాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇప్పటి దాకా 102 వందేభారత్‌ రైళ్ల తయారీకి కాంట్రాక్ట్‌ ఇచ్చారు. ఇవన్నీ కూడా చైర్‌ కార్‌ రైళ్లే. వీటిలో ప్రస్తుతం 10 రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి రోజువారి నడుస్తున్నాయి. దశలవారిగా మిగిలిన రైళ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement