Monday, December 2, 2024

TG | ఖేలో ఇండియా గేమ్స్‌కు వేదిక‌గా హైదరాబాద్…

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఖేలో ఇండియా – 2026 పోటీలను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా సానుకూలంగా స్పందించింది. వచ్చే ఏడాది నిర్వహించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేసినా.. 2025లో బీహార్‌లో నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు.

ఈ క్ర‌మంలో 2026లో హైదరాబాద్‌లో నిర్వహించేందుకు కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్‌సుఖ్‌సింగ్‌ మాండవియా సానుకూలంగా స్పందించి సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌రెడ్డికి హామీ ఇచ్చారు. రాతపూర్వక విజ్ఞప్తిని జితేందర్‌రెడ్డి గురువారం (నవంబరు 28) కేంద్ర మంత్రికి అందజేసి వివరించగా పై స్పష్టత లభించింది.

క్రీడాభివృద్ధికి క‌లిసి ప‌నిచేయాలి..

ముఖ్యమంత్రి రేవంత్ విజ్ఞప్తిని కేంద్ర మంత్రికి వివరించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి…. అంతర్జాతీయ స్థాయిలో మన దేశానికి క్రీడారంగంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు వచ్చేలా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని వివరించారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నందుకు కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆర్థికంగా మాత్రమే కాక అనేక రంగాల్లో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ప్రత్యేక గుర్తింపు సాధించిందని, ఇకపైన క్రీడా పోటీల నిర్వహణతో పాటు భవిష్యత్తులో ఉత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన అవగాహనతో ఉన్నదని జితేందర్ రెడ్డి గుర్తుచేశారు.

కేంద్ర మంత్రితో జరిగిన ఈ సమావేశంలో జితేందర్ రెడ్డితో పాటు ఎంపీలు డాక్టర్ మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రామసహాయం రఘురామ్‌రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement