Thursday, March 28, 2024

HYD : దంచికొట్టింది.. నగరంలో భారీ వర్షం..

వాతావరణ శాఖ సూచించినట్లుగానే నగరంలోని భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా వాతావరనం చల్లబడి కుండపోతగా వర్షం కురిసింది. కూకట్​పల్లి, హైదర్​నగర్​, కేపీహెచ్​బీ కాలనీ, ఆల్విన్​కాలనీ, ప్రగతినగర్​, బంజారాహిల్స్​, జూబ్లిహిల్స్, పంజాగుట్ట, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి, మియాపూర్, మెహిదీపట్నం, జీడిమెట్ల, మాదాపూర్, గచ్చిబౌలి తోపాటు ప‌లు ప్రాంతాల్లో మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షం కురుస్తోంది. ప‌లు చోట్ల‌ ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ రోడ్లపై మ్యాన్​హోల్స్​ పొంగిపొర్లుతున్నాయి. నగరంలోని పలు ప్రధాప కూడలల్లో ట్రాఫిక్ స్థంభించడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. వెంటనే అప్రమత్తమైన డీఆర్ ఎఫ్, మాన్సూన్ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement