Saturday, April 20, 2024

85 మంది దౌత్యవేత్తలపై వేటు.. ఇటలీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌పై ప్రతీకారం..

మాస్కో:మరియపోల్‌పై విజయం నేపథ్యంలో రష్యా దత్యయుద్ధం ముమ్మరం చేసింది. బుధవారం ఒక్కరోజే ఐరోపా దేశాలైన ఫ్రాన్స్‌, ఇటలీ, స్పెయిన్‌పై దత్య యుద్ధం ప్రకటించింది. ఆయా దేశాలకు చెందిన 85మందిపై బహిష్కరణ వేటు వేసింది. అయితే వేటువేసిన ఆ దత్యవేత్తలు దేశం విడిచివెళ్లే గడువు విషయంలో ఒక్కో దేశానికి ఒక్కోలా ప్రకటించింది. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ప్రపంచ దేశాలు దాదాపు 395మంది రష్యా దత్తవేత్తలను బహిష్కరించిన నేపథ్యంలో రష్యా ఇప్పుడు ప్రతీకార చర్యకు పాల్పడింది. ఉక్రెయిన్‌పై దండయాత్ర నేపథ్యంలో యూరోపియన్‌ యూనియన్‌లోని సభ్య దేశాలతో రష్యా సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు ఫ్రాన్స్‌కు చెందిన 34మంది, స్పెయిన్‌కు చెందిన 27మంది, ఇటలీకి చెందిన 24మంది అత్యున్నత స్థాయి దత్యవేత్తలను దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించినట్లు రష్యా విదేశాంగ శాఖ బుధవారం ప్రకటించింది.

స్పెయిన్‌ దత్యవేత్తలు ఒక వారంలోగా, ఫ్రాన్స్‌ దత్యవేత్తలు రెండువారాల్లోగా దేశం విడిచివెళ్లాలని పేర్కొంది. కాగా ఇప్పటికే పోలండ్‌కు చెందిన 45మంది, జర్మనీకి చెందిన 40మంది దత్యవేత్తలను రష్యా బహిష్కరించిన విషయం తెలిసిందే. అలాగే ఫిన్‌లాండ్‌, రొమేనియా, డెన్మార్క్‌, స్వీడన్‌, నారే, బెల్జియం, నెదర్లాండ్స్‌, జపాన్‌ దత్యవేత్తలపైనా నిషేధం విధించింది. కాగా రష్యా తాజా చర్యను ఇటలీ ప్రధాని మరియో డ్రాఘి ఖండించారు. యూరోపియన్‌ యూనియన్‌లో సభ్యదేశాలైన సైప్రస్‌, మాల్టా, హంగేరీ మినహా మిగిలిన దేశాలన్నీ రష్యా దత్యవేత్తలను బహిష్కరించాయి. కాగా నాటోలో చేరేందుకు బుధవారంనాడు ఫిన్‌లాండ్‌, సీడన్‌ దరఖాస్తు చేసుకున్నాయని నాటో సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ ప్రకటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement