Sunday, October 13, 2024

త్వరలోనే హంట్ రిలీజ్ డేట్.. అప్ డేట్ ఇచ్చిన మేకర్స్

హీరో సుధీర్ బాబు పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. సెహరీ ఫేం జ్ఞానసాగర్‌ దర్శకత్వంలో హరోం హర చిత్రంలో నటిస్తున్నాడు. మరోవైపు మామా మచ్చింద్ర, పుల్లెల గోపిచంద్‌ బయోపిక్‌ కూడా లైన్‌లో ఉన్నాయి. ప్రస్తుతం సుధీర్‌ బాబు నటిస్తోన్న చిత్రాల్లో హంట్ కూడా ఒకటి.యాక్షన్‌ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రాన్ని మహేశ్ సూరపనేని డైరెక్ట్ చేస్తున్నాడు. భరత్‌ నివాస్‌, శ్రీకాంత్‌ మేక ప్రధాన పాత్రల్లో నటిస్తు్న్నారు. భ‌వ్య క్రియేష‌న్స్ ప‌తాకంపై వి.ఆనంద్ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జిబ్రాన్‌ సంగీతం అందిస్తున్నాడు.అరుళ్‌ విన్సెంట్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. ఈ సినిమా అప్‌డేట్‌ ఇచ్చింది సుధీర్ బాబు టీం. సుధీర్‌ బాబు కోసం యాక్షన్‌ కొరియోగ్రఫర్స్‌ రెనౌడ్‌-బ్రియాన్‌ పర్యవేక్షణలో స్టన్నింగ్‌ యాక్షన్‌ సీన్లను కంపోజ్ చేశారు. ఈ ఇద్దరు జాన్ విక్‌.. చాఫ్టర్‌ 4 సినిమాకు కూడా పనిచేస్తున్నారు. త్వరలో హంట్‌ విడుదల తేదీని ప్రకటించనున్నట్టు మేకర్స్ అప్‌డేట్ అందించారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement