Friday, February 3, 2023

హంట్ ట్రైల‌ర్.. అద‌ర‌గొట్టిన సుధీర్ బాబు

భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మించిన చిత్రం హంట్..ఈ చిత్రానికి మహేశ్ సూరపనేని దర్శకత్వం వహించాడు. గిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చారు.హంట్ చిత్రం ట్రైలర్ ని రిలీజ్ చేశారు..ఈ చిత్రంలో హీరోగా సుధీర్ బాబు నటించారు.
సుధీర్ బాబు సరసన చిత్ర శుక్లా కథానాయికగా అలరించనుంది. గతంలో కొన్ని తెలుగు సినిమాలు చేసిన ఆమె సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తోంది. ఈ నెల 26వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీకాంత్ .. భరత్ ఇద్దరూ కూడా ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్స్ గా కనిపించనున్నారు. కథానాయకుడు అర్జున్ ఓ పోలీస్ ఆఫీసర్. అతను ఒక కేసుకు సంబంధించిన పరిశోధన జరుపుతూ ఉండగా, ప్రమాదానికి గురవుతాడు. ఫలితంగా మెమరీ లాస్ అవుతాడు. అయినా అతను ఆ కేస్ ను ఎలా డీల్ చేశాడు.. ఆ ప్రయత్నంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కున్నాడు.. అనేదే కథ.

Advertisement

తాజా వార్తలు

Advertisement