Thursday, April 25, 2024

సుధీర్ బాబు హీరోగా హంట్-ఆక‌ట్టుకుంటోన్న ఫ‌స్ట్ లుక్

హీరో సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘హంట్’ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మహేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వి. ఆనంద ప్రసాద్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి రెండో వారంలో ఈ చిత్ర రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమైంది. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటోంది.ఈ మేర‌కు ఫ‌స్ట్ లుక్ మోష‌న్ పోస్ట‌ర్ ని రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో సుధీర్ బాబు ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌ రోల్ చేస్తున్నారు. ఇతర కీలక పాత్రల్లో సీనియర్ హీరో శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్, గోపరాజు రమణ, ‘జెమినీ’ సురేష్, మైమ్ గోపి, అజయ్ రత్నం తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో మిగతా వివరాలు వెల్లడిస్తాం. సుధీర్ బాబుకి ఇది 16వ చిత్రం.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement