Saturday, April 20, 2024

స్టూడెంట్స్​కి భారీ షాక్​.. మూడు రెట్లు పెరగనున్న బస్​ పాస్​ చార్జీలు

తెలంగాణలో పాఠ‌శాల‌ల పునఃప్రారంభం కానున్న స‌మ‌యంలో బ‌స్ పాస్ వాడే రాష్ట్ర విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ భారీ షాకిచ్చింది. రూట్ బ‌స్ పాసుల ధ‌ర‌ల‌ను ఏకంగా మూడింత‌ల మేర పెంచుతే ఈ రోజు సాయంత్రం టీఎస్సార్టీసీ నుంచి ఓ కీల‌క ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. విద్యార్థుల రూట్ బ‌స్ పాసుల్లో భాగంగా 4 కిలో మీట‌ర్ల దూరానికి ఇప్ప‌టిదాకా రూ.165 చెల్లిస్తుంటే.. దానిని ఏకంగా రూ.450కి పెంచింది.

8 కిలో మీట‌ర్ల దూరానికి ఇప్ప‌టిదాకా రూ.200గా ఉన్న ధ‌ర‌ను రూ.600ల‌కు పెంచింది. 12 కిలో మీట‌ర్ల దూరానికి బ‌స్ పాస్ ధ‌ర‌ను రూ.245 నుంచి రూ.900ల‌కు పెంచింది. 18 కిలో మీట‌ర్ల దూరం బ‌స్ పాస్ ధ‌ర‌ను రూ.280 నుంచి రూ.1,150కి, 22 కిలో మీట‌ర్ల బ‌స్ పాస్ ధ‌ర‌ను రూ.330 నుంచి రూ.1,350కి పెంచింది. ఈ పెంపుతో విద్యార్థుల‌పై భారీ భారం ప‌డ‌నుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement