Friday, April 19, 2024

టూ వీలర్‌లో భారీ అమ్మకాలు..

టూ వీలర్‌ అమ్మకాల్లో మాత్రం రికార్డు స్థాయి గణాంకాలు నమోదయ్యాయి. 2021 ఏప్రిల్‌తో పోలిస్తే.. 2022లో 15.43 శాతం టూ వీలర్‌ విక్రయాల్లో వృద్ధి నమోదైంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 11,48,696 యూనిట్లు అమ్ముడుపోతే.. గతేడాది ఏప్రిల్‌లో 9,95,115 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఇక త్రీ వీలర్‌ సెగ్మెంట్లోనూ భారీ వృద్ధి నమోదైంది. గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే.. ఈ ఏడాది ఏప్రిల్‌లో 51.11 శాతం అమ్మకాలు పెరిగాయి.

గతేడాది 13,856 యూనిట్లు అమ్ముడుపోతే.. ఈ ఏడాది 20,938 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఏది ఏమైనప్పటికీ.. లాక్‌డౌన్‌ తరువాత.. టూ వీలర్‌తో పాటు త్రీ వీలర్‌ అమ్మకాలు కొంత పెరిగాయి. ఓవరాల్‌గా.. ఆటో పరిశ్రమలో 11.85 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 14,21,241 యూనిట్లు అమ్ముడుపోగా.. గతేడాది ఇదే నెలలో 12,70,604 యూనిట్ల విక్రయాలు జరిగాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement