Friday, April 19, 2024

వడగండ్ల వాన, ఈదురు గాలులకు అపార పంట నష్టం..

నార్పల, ప్రభన్యూస్‌: అనంతపురం జిల్లా నార్పల మండలంలో శనివారం సాయంత్రం కురిసిన వడగండ్లవాన, ఈదురు గాలులకు రైతు లకు చేతికొచ్చిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.నార్పల మండలంలోని కెశేపల్లి, కురగానీపల్లి, నడిమీదొడ్డి, గడ్డంనాగయ్యపల్లి, వెంకటాంపల్లి, కర్ణపూడికి, పులుసలనూతల, నాయనపల్లి, మద్దలపల్లి తదితర గ్రామాలలో వరిపంట, మొక్కజొన్న, అరటి, చినీ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. చేతికి వచ్చిన పంట వడగండ్ల వాన,ఈదురు గాలులకు పూర్తి దెబ్బతినింది.

ఈ సంఘటనతో విద్యుత్‌ లైన్లు, భారీ వృక్షాలు నేలవాలాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నిలువునా నాశనం కావడంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. అరటి చెట్లు- గెలలతో పడిపోయాయి. వెంకటాపల్లి, కర్ణాపొడికి, కురగానీపల్లి ప్రాంతాలలో అరటిమామిడి సీజేట్లు అధికాశాతం దెబ్బతిన్నట్లు అంచనాలు వేస్తున్నారు. మామిడి, చినీ చెట్లు ఈదురుగాలులకు కాయలు మొత్తం పాదుల్లో పడిపోయాయి.

- Advertisement -

వరి,మొక్కజొన్న పంటలు పూర్తిగా వెన్నువిరిగి నెల పాలయ్యాయి. చినీ, మామిడి, మొక్కజొన్న,అరటి ధరలు రైతుకు ఆశాజనకంగా ఉన్నం దున రైతులు తమ అప్పులు తీరుతాయని ఆశలు పెంచుకున్నారు. ప్రకృతి కోపించి రైతుల ఆశలపై వడగండ్ల వాన కురిపించి పంటలు నాశనం చేసింది. చేతికొచ్చేపంట నెలపాలైతే అప్పులేల తీర్చాలి, జీవనం ఎలా గడపాలిరా… దేవుడా….? అంటు- రైతులు లబోదిబోమంటు-న్నారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement