Tuesday, April 23, 2024

సీఎం కప్‌ 2023 క్రీడలకు భారీ ఏర్పాట్లు.. షూటింగ్‌ పోటీలకు గచ్చిబౌలి స్టేడియం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సీఎం కప్‌ 2023 రాష్ట్ర స్థాయిపోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ కు చేరుకుంటున్న క్రీడా కారులకు ఎలాంటి ఇబ్బందులు కలగుండా పటిష్టమైన చర్యలు తీసకున్నట్లు రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ చైర్మన్‌ ఆంజనేయగౌడ్‌ చెప్పారు. శనివారం రాష్ట్ర స్థాయి పోటీల ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సంభంధిత శాఖల అధికారులతో ఆంజనేయగౌడ్‌, క్రీడల శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ట్రాఫిక్‌ డీసీపీ, శాంతిభద్రతల డీసీపీ, టూరిజం శాఖ ఎండీ, జీహెచ్‌ఎంసీ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

29న ప్రారంభోత్సవం, 31న ముగింపు వేడుకల నిర్వహణపై సమావేశంలో చర్చించారు. 29న జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాహుల్‌ సిప్లిగంజ్‌ తోపాటు పలువురు కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు కావల్సిన మౌలిక సదుపాయాలపై చర్చించారు. అలాగే రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులకు వసతి, భోజన సదుపాయలపై చర్చజరిగింది.

18 క్రీడాంశాల్లో గచ్చిబౌలి, సరూర్‌ నగర్‌, కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి, జింఖానా గ్రౌండ్స్‌, షూటింగ్‌ కోసం గచ్చిబౌలి స్టేడియంలో పోటీలు జరగనున్నయి.క్రీడాకారులు బసచేసే హాస్టల్స్‌ కు పోలీసు బందోబస్తుఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రత్యేకంగా మహిళా పోలీసులను మహిళాక్రీడాకారుల భద్రతకోసం నియమించారు. సమావేశం అనంతరం క్రీడా కారుల భోజన సౌకర్యాలను అధికారులు పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement