Friday, March 29, 2024

వాట్సాప్‌లో కోవిడ్ సర్టిఫికెట్ తీసుకోవడం ఎలా?

కరోనా టీకా తీసుకున్న తర్వాత వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ పొందడం ఇప్పుడు మరింత సులభతరంగా మారింది. వాట్సాప్‌ ద్వారా చాలా తక్కువ వ్యవధిలోనే వ్యాక్సిన్ సర్టిఫికెట్ పొందవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి, ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణించాలంటే వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరిగా మారింది. దీంతో వాట్సప్ ద్వారా కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు.

వాట్సాప్ ద్వారా సర్టిఫికెట్ తీసుకునే విధానం:

★ +91 9013151515 నంబర్ సేవ్ చేసుకోవాలి.
★ కరోనా వ్యాక్సిన్‌ కోసం కోవిన్‌ పోర్టల్‌లో లేదా కోవిన్‌ యాప్‌లో రిజిస్టర్‌ చేసుకున్న ఫోన్‌ నెంబర్‌ ఉన్న ఫోన్‌ను ఇందుకు ఉపయోగించాలి.
★ అనంతరం సదరు నంబర్ గల వాట్సాప్‌లో ‘covid certificate’ అని టైప్ చేసి పంపాలి.
★ ఆ తర్వాత మొబైల్‌కు ఆరు అంకెల నంబర్ గల OTP వస్తుంది.
★ కరోనా వ్యాక్సిన్‌ కోసం ఒక్క ఫోన్‌ నెంబర్‌తో ఒక్కరి కంటే ఎక్కువ మంది రిజిస్టర్‌ చేసుకొని ఉంటే.. వారందరి పేర్ల జాబితాను వాట్సాప్‌ మీకు పంపిస్తుంది. వారిలో ఎవరెవరి సర్టిఫికెట్లు కావాలని మీరు కోరుతున్నారో అడుగుతుంది.
★ ఎంతమంది సర్టిఫికెట్లు కావాలో సూచిస్తూ ఆ సంఖ్యను ఎంటర్‌ చేయాలి. కొన్ని సెకండ్లలోనే వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ వాట్సాప్‌ చాట్‌ బాక్సులో ప్రత్యక్షమవుతుంది. దాన్ని మీరు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఈ వార్త కూడా చదవండి: కరోనా వ్యాక్సిన్ తీసుకుంటేనే రైలు ప్రయాణం

Advertisement

తాజా వార్తలు

Advertisement