Saturday, April 20, 2024

చెవికి రిసీవర్, బనియన్ కు డివైస్.. హైటెక్ కాపీ కొడతూ పట్టుపడ్డ సౌరభ్

పరీక్షలు రాసేందుకు బుద్దిగా చదువుకోకుండా…అడ్డదారులు తోక్కుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరగుతోంది. పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్స్ కళ్లు కప్పి కాపీ కొడుతున్నారు.. తాజగా సరూర్ నగర్ లో హైటెక్ తరహా లో పరీక్ష కాపీ కొడుతునన్న ఓ యువకుడు అడ్డంగా బుక్ అయ్యాడు. హర్యణా కు చెందిన సౌరభ్ వాయుసేన లో ఎయిర్ మెన్ ఆన్ లైన్ పరిక్ష కోసం హైదరాబాద్ నగరానికి వచ్చాడు. అతనికి కర్మాణ్ ఘాట్ ఎస్ఈజెడ్ పరీక్ష కేంద్రం లో సెంటర్ పడింది. అయితే చెవికి‌ రిసీవర్, బనియన్ కు ఎలక్ట్రానిక్ డివైస్ ను సౌరభ్ అమర్చాడు. సీసీ కెమెరాల్లో పరిక్షా కేంద్రం సిబ్బంది పరిశీలిస్తుండగా… సౌరభ్ కదలికలు అనుమానాస్పందంగా కనిపించడం తో చెకింగ్ చేసారు ఇన్విజిలేటర్స్. హర్యాణా నుంచి మిత్రుల సహాకారం తో సౌరభ్ పరిక్ష రాస్తున్నట్లు పసిగట్టిన సిబ్బంది… సరూర్ నగర్ పోలిసులకు ఫిర్యాదు చేసారు. దాంతో కేసు నమోదు చేసుకుని సౌరభ్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఇది కూడా చదవండి: గుంటూరు జిల్లాలో దారుణం.. ఏడు నెలల పాపపై అఘాయిత్యం

Advertisement

తాజా వార్తలు

Advertisement