Thursday, April 18, 2024

హిట్2 ప్రీరిలీజ్ ఫంక్ష‌న్.. గెస్ట్ గా రాజ‌మౌళి

ఈ నెల 28న హైద‌రాబాద్ ఫిల్మ్ న‌గ‌ర్ లోని జేఆర్సీ క‌న్వెన్ష‌న్ లో హిట్2 మూవీ ప్రీరిలీజ్ వేడుక జ‌ర‌గ‌నుంది.చీఫ్ గెస్టుగా రాజమౌళి రానున్నారనే విషయాన్ని ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. రాజమౌళితో నానికి మంచి సాన్నిహిత్యం ఉంది. అందువలన నాని ఆహ్వానం మేరకు ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడన్న మాట. ఈ సినిమాలో అడివి శేష్ సరసన నాయికగా మీనాక్షి చౌదరి నటించింది..

అడివి శేష్ హీరోగా నాని నిర్మాణంలో ‘హిట్ 2’ సినిమా రూపొందింది. శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన అప్ డేట్స్ అంచనాలు పెంచుతూ వచ్చాయి. ఒక యువతి మర్డర్ కేసు మిస్టరీని ఛేదించడం కోసం రంగంలోకి దిగిన పోలీస్ ఆఫీసర్ కీ, ఆ హత్యతో అనేక హత్యలు ముడిపడి ఉన్నాయనే సంగతి తెలుస్తుంది. అప్పుడతను ఏం చేశాడనేదే కథ. డిసెంబర్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా ముందుగానే చెప్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement