Thursday, April 25, 2024

Follow up : హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికలు కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా విడుదల

హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లి ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ మొత్తం 68 నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను ఒకేసారి విడుదల చేసింది. అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, జాబితాను కాంగ్రెస్‌ పార్టీ ట్విట్టర్‌లో ట్వీట్‌ చేసింది. కాంగ్రెస్‌ అధికారంలోకొస్తే పది రోజుల్లోనే పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరిస్తామని హామీనిచ్చింది. 1972లో హిమాచల్‌ప్రదేశ్‌ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన 11సార్లు అసెంబ్లి ఎన్నికల్లో అధికారంలో ఉన్న ఏపార్టీ కూడా మళ్లి విజయం సాధించి అధికారంలోకి రాలేదు. గత మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్‌, బీజేపీల మధ్య అధికార మార్పిడి జరుగుతూ వస్తోంది. ఈసారి అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోటీ సాగుతోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement