Sunday, March 26, 2023

చిన్నారుల్లోనూ హైబీపీ.. 12 ఏళ్ల వ‌య‌స్సులోనే గుండె సంబంధ వ్యాధులు

మన దేశంలో చిన్నారులు, యువత ‘హైపర్‌ టెన్షన్‌ (హై బీపీ)తో బాధపడుతున్నారు అని ‘ది ఇండియన్‌ హెల్త్‌ పోర్ట ల్‌’ రిపోర్ట్‌ ప్రకటిం చింది. ఇది భారత భవిష్యత్తు తరాల ఆరోగ్య పరిస్థితిని ఆందోళనలో నెట్టవేసే ప్రమాద హెచ్చరికలు. తస్మాత్‌ జాగ్రత్త అని హెచ్చరించే సూచ నలు. హైబీపీ, మధు మేహం, థైరాయిడ్‌ వంటి జబ్బులు రెండు దశా బ్దాల క్రితం వరకూ కొంత వయస్సు మీరిన తర్వాత వచ్చేవి. కానీ నేడు 10 సంవత్సరాల పిల్లలు నుంచి 25 సంవత్సరాల యువత ఈ జబ్బులు బారినపడుతూ, జీవచ్ఛవంలా బ‌తికే పరిస్థితి ఏర్ప డింది. ముఖ్యంగా హైబీపీతో 30 శాతం చిన్నారులు యువత మనదేశంలో బాధ పడుతున్నారు.

వీరిలో 34 శాతం మంది పట్టణాల్లో ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 28శాతం మంది ఉన్నారు. ఈ హై బీపీ సమస్యవల్ల గుండె సంబంధిత జబ్బులు ప్రబలుతున్నాయి. ‘అనిల్‌ వాసుదేవ్‌’ జామా నెట్‌వర్క్‌ ఓపెన్‌ రిపోర్ట్‌ ప్రకారం, 10-12 సంవత్సరాల వయస్సు గల చిన్నారుల్లో 35 శాతం మంది హైబీపీతో బాధపడుతున్నారని, 13 సంవత్సరాల వయస్సు పైబడిన వారిలో 25శాతం మంది ఈ వ్యాధితో బాధ పడుతున్నార ని తెలిపింది. దాదాపు పట్టణ గ్రామీణ ప్రాం తాల్లో సరి సమానంగా ఈ వ్యాధి విస్తరించింది. ప్రతీ నలు గురు చిన్నారుల్లో ఒకరు హైబీపీబాధితుడే. గతంలో కంటే 7 శాతం వ్యాధి ఉధృతి పెరిగింది. శారీరక శ్రమ లేకపోవడం, సుఖ జీవ నానికి అలవాటుపడుట. వ్యాయామం లేకపోవడం. చిన్నారులు, యువత ఎక్కువగా సెల్‌ ఫోన్లు, లాప్‌ టాప్‌, కంప్యూటర్‌ ముందు గంటలు కొలది కూర్చుని కాలం గడుపు తున్నారు.

- Advertisement -
   

ఇది కూడా ప్రమాదమే…

ఫాస్ట్‌ ఫుడ్‌, జంక్‌ ఫుడ్‌, ఉప్పు, షుగర్‌ ఎక్కువగా ఉండే ”రెడీ టు ఈట్‌” ఫుడ్‌, స్నాక్స్‌, బేకరి ఐటమ్స్‌, ఐస్‌ క్రీమ్‌, చాక్లెట్స్‌, కొవ్వు పదార్థాలు వంటివి ఎక్కువగా భుజించడం వల్ల ఈ విపరీతమైన అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా మన ప్రాంతంలో నిల్వ పచ్చళ్లు, ఊరగాయలు, ఎండు చేపలు వం టివి ఎక్కువగా భుజించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అని గ్రహించాలి. ఫాస్టింగ్‌ బ్లడ్‌షుగర్‌, హీమోగ్లోబిన్‌, సెరిమ్‌ ట్రైగ్లిజరైడ్స్‌, ఎల్‌.డి.ఎల్‌ కొలెస్ట్రాల్‌ స్థాయిల్లో మార్పులు హైబీపీకి కారణం అవుతు న్నాయి. ఎదుగుదల సరిగా లేనివారు (స్టంట్‌) లో 40 హైబీపీ బాధితులు ఉండగా, మామూలుగా ఉన్నవారిలో 34 శాతం వారున్నారు. బరువు తక్కువగా ఉన్న చిన్న వారిలో 34 శాతం హైబీపీ బాధితులు ఉండగా, యువతలో 22 శాతం వారున్నారు.

ఉప్పు షుగర్‌ లెవెల్స్‌ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని భుజిస్తున్న వారిలో ఎక్కు వగా చదువుకుంటున్న విద్యా ర్థులే. ప్యాకింగ్‌ ఫుడ్‌, చిరు తిళ్ళు, బేకరి ఐటమ్స్‌, ఆయి ల్‌ ఫుడ్స్‌ ఫ్రైడ్‌ ఫుడ్స్‌ వీరు ఎక్కు వగా తినడం వల్ల అనేక అనారోగ్యాలకు గురవు తున్నారు. ఛత్తీస్‌గఢ్‌, ఒడిషా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మణిపూర్‌, మి జోరం, నాగాలాండ్‌, త్రిపుర వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా ఉప్పు షుగర్‌ లెవెల్స్‌ ఉన్న ఆహారం భుజించడం వల్ల సు మారు 35 శాతం మంది హై బీపీతో బాధపడుతు న్నారని గుర్తించారు. యన్‌.యస్‌.యస్‌.ఓ సర్వే 2011-12 ప్రకారం రోజూ ప్రతీ ఒక్కరూ సగటున 9 గ్రాముల ఉప్పు తీసు కుం టున్నారని తెలిపారు. ఈవిధంగా ఉప్పు,షుగర్‌, నిల్వ ఉంచే ప్రిజ ర్వేషన్‌ వంటి ఆహార పదార్థాలు భుజించడం వల్ల చిన్నారులు యువత అనేక రోగాలను కొనితెచ్చుకుం టున్నారు. సరైన, మితమైన పోషకా హారం భుజించాలి. కనీసం శారీరక వ్యాయామం చేయాలి. ఆరోగ్యమే మహా భాగ్యం అనే భావన అందరిలో రా వాలి. అప్పుడే ఆరోగ్య భారత్‌ నిర్మితమవుతుందని అందరూ గ్రహించాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement