Wednesday, April 24, 2024

హైదరాబాద్‌లో హైటెక్‌ వ్యభిచారం.. అంతర్జాతీయ సెక్స్ రాకెట్ ముఠా అరెస్ట్…

సైబరాబాద్ పోలీసులు మరో సెక్స్ రాకెట్ మూఠా గుట్టురట్టు చేశారు. గుట్టుచ‌ప్పుడు కాకుండా విదేశీ మ‌హిళ‌ల‌తో వ్య‌భిచారం న‌డిపిస్తున్న అంతర్జాతీయ సెక్స్ రాకెట్ ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. 39 కేసుల్లో 17 మందిని అరెస్ట్ చేసి.. వారి నుంచి 14,190 మంది బాధితులని విముక్తి క‌ల్పించారు. పలు వెబ్ సైట్ల పేరుతో ముఠా వ్యభిచారం నిర్వహిస్తున్న‌ట్లు, ఉపాధి క‌ల్పిస్తామ‌ని ఆశ చూపి తీరా వ‌చ్చాక వారితో వ్యభిచారం చేయిస్తున్నారు. కాల్ సెంటర్, వాట్సాప్ గ్రూపులో స్లాట్స్ బుక్ చేస్తున్నారు. వీరు డ్రగ్స్ కూడా సరాఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, ముంబైతో పాటుగా బంగ్లాదేశ్, నేపాల్, థాయిలాండ్, రష్యా దేశాలకు చెందిన బాధితులకు విముక్తి ల‌భించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement