Wednesday, April 24, 2024

ర‌ష్మిక ఫొటోల‌కి ఎగ‌బ‌డిన మీడియా-మోస్ట్ స్టైలిష్ అవార్డుల ఈవెంట్ లో మెరిసిన బ్యూటీ

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న‌..ఇప్పుడిప్పుడే బాలీవుడ్‌లో అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటోంది. వ‌రుసగా సినిమాలు చేస్తూ అక్క‌డి ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ను దోచుకోవ‌టానికి సిద్ధ‌మైంది. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో మిష‌న్ మ‌జ్ను, గుడ్ బై చిత్రాల్లో నటించింది. ఇప్పుడు ర‌ణ్‌భీర్ క‌పూర్‌తో క‌లిసి యానిమ‌ల్ సినిమాలో ఆడి పాడుతోంది. ఇది కాకుండా కోలీవుడ్ అగ్ర హీరో విజ‌య్ హీరోగా రూపొందుతోన్న తెలుగు, త‌మిళ భాషా చిత్రం వార‌సుడు (త‌మిళంలో వారిసు)లో ర‌ష్మిక హీరోయిన్‌. సీతా రామం చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో మెప్పించ‌నుంది.

ఇవ‌న్నీ కాకుండా మ‌రోసారి అల్లు అర్జున్‌తో క‌లిసి పుష్ప ది రూల్ సినిమాలో ఆడియెన్స్ మ‌న‌సుల‌ను అల‌రించ‌నుంది.తాజాగా నేష‌న‌ల్ క్ర‌ష్ రష్మిక మందన్న .. మోస్ట్ స్టైలిష్ అవార్డుల ఈవెంట్‌కు హాజ‌రైంది. వ‌చ్చిందంటే అలా ఇలా కాదండోయ్ ఇది వ‌ర‌కు ఎన్నడూ క‌నిపించ‌నంత హాట్‌గా వ‌చ్చేసింది. రెడ్ డ్రెస్‌లో హాట్ చిల్లీ థైస్ షోతో ర‌ష్మిక వ‌చ్చింది. ఇంకే ముంది. ఫొటోగ్రాఫ‌ర్స్ ర‌ష్మిక అందాల‌ను త‌మ కెమెరాల్లో బంధించ‌డానికి పోటీలు ప‌డ్డారు. కాస్త ఇబ్బందిప‌డ్డ‌ప్ప‌టికీ ర‌ష్మిక ఫొటో సెష‌న్‌ను పూర్తి చేసి ఈవెంట్‌లోకి వెళ్లిపోయింది..ఇప్పుడామె ఫొటోలు, వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement