Wednesday, April 24, 2024

చిత్రం చూడ‌ర‌.. ఫ‌స్ట్ లుక్

చిత్రం చూడ‌ర మూవీ ఫ‌స్ట్ లుక్ ని రిలీజ్ చేశారు మేక‌ర్స్.ఈ చిత్రంలో హీరో వ‌రుణ్ సందేశ్ న‌టిస్తున్నాడు. ఆర్‌ఎన్‌ హర్షవర్ధన్‌ దర్శకత్వం వ‌హించాడు..ధన తుమ్మల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాధన్‌ మ్యూజిక్ డైరెక్టర్‌. దినేశ్‌ కే బాబు కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రంలో ధన్‌రాజ్‌, కాశీ విశ్వనాథ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వరుణ్ సందేశ్‌, ధన్‌ రాజ్‌, కాశీ విశ్వనాథ్‌ జైలులో ఉన్న లుక్‌ చూసి.. వీరంతా ఏదైనా సీరియస్‌ క్రైం చేశారా. అని తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. అసలేం జరిగిందనేది తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే. ఈ ప్రాజెక్ట్‌లో రవిబాబు, తనికెళ్లభరణి, రాజా రవీంద్ర, శివాజీ రాజా, శీతల్‌ భట్‌, మీనా కుమారి, అన్నపూర్ణమ్మ కీలక పాత్రల్లో నటించారు. నేనింతే ఫేం శియా గౌతమ్‌ స్పెషల్ సాంగ్‌లో మెరువనుంది. బీఎం సినిమాస్‌ బ్యానర్‌పై శేషు మారంరెడ్డి, బోయపాటి భాగ్యలక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement