Thursday, March 28, 2024

రెండో పెళ్లికి సిద్ధమవుతున్న హీరో సుమంత్

అక్కినేని ఫ్యామిలీకి చెందిన హీరో సుమంత్ రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. 2006లో హీరోయిన్ కీర్తిరెడ్డిని పెళ్లి చేసుకున్న రెండేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నాడు. అప్పటి నుంచి సుమంత్ ఒంటరిగానే ఉంటున్నాడు. అడపాదడపా సినిమాలు చేసినా అవి హిట్ కాలేకపోయాయి. అయితే తాజాగా సుమంత్ మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు సుమంత్ పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పవిత్ర అనే తన సన్నిహితురాలిని సుమంత్ పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే తన పెళ్లి వేడుకను ప్రైవేట్ కార్యక్రమంగా, కుటుంబ వేడుకగా కొద్ది మంది స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో జరుపాలని సుమంత్ నిర్ణయించుకున్నాడు. కాగా సుమంత్‌ జీవితంలో అడుగుపెట్టనున్న పవిత్ర ప్రస్తుతం అడ్వకేట్‌గా పనిచేస్తోంది. ముఖ్యంగా సుమంత్‌కు పవిత్ర బాల్య స్నేహితురాలు. ఇద్దరు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో కలిసి చదువుకున్నారనే విషయం సన్నిహితుల ద్వారా తెలిసింది.

ఈ వార్త కూడా చదవండి: సినిమా అంటే చిన్న చూపా?: హీరో నాని ఆవేదన

Advertisement

తాజా వార్తలు

Advertisement