Thursday, April 25, 2024

సోష‌ల్ మీడియాని షేక్ చేస్తోన్న.. రామ్ చ‌ర‌ణ్ న్యూలుక్

సోష‌ల్ మీడియాని షేక్ చేస్తోంది మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న్యూలుక్..ప్రస్తుతం రామ్ చ‌ర‌ణ్ శంక‌ర్ డైరెక్షన్‌లో చేస్తున్న ఆర్‌సీ 15 సినిమాతో బిజీగా ఉన్నారు. పొలిటిక‌ల్ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ న్యూజిలాండ్‌ షెడ్యూల్‌లో బిజీగా ఉంది. ఓ వైపు షూటింగ్‌ షెడ్యూల్‌తో తీరిక లేకుండా ఉన్నప్పటికీ.. ఫ్యాన్స్ కోసం ఇలా న్యూజిలాండ్ వీధుల్లో స్టైలిష్‌ అవతార్‌లో కనిపిస్తూ సందడి చేశారు రాంచ‌ర‌ణ్. ప్రస్తుతం న్యూజిలాండ్‌ లోస్టైలిష్‌ డ్యుయెట్‌ చిత్రీకరణ కొనసాగుతుంద‌ట‌. కంప్లీట్‌ బ్లాక్ డ్రెస్‌కు మ్యాచ్ అయ్యే గాగుల్స్‌తో కెమెరాకు స్టన్నింగ్ ఫోజులిచ్చారు. ఈ ఫొటోలు ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్‌ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement