Sunday, March 26, 2023

రాజ్ తరుణ్ చిత్రానికి వెరైటీ టైటిల్.. తిరగబడర స్వామి

ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా టైటిల్స్ భలే గమ్మత్తుగా ఉంటున్నాయి. తాజాగా హీరో రాజ్ తరుణ్ నటిస్తోన్న చిత్రానికి వెరైటీ పేరుని పెట్టారు చిత్ర మేకర్స్. ఈ చిత్రానికి టైటిల్ గా తిరగబడర స్వామి అని పెట్టారు. ఏఎస్‌ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని సురక్షా ఎంటర్‌టైన్‌మెంట్‌పై మల్కాపురం శివకుమార్‌ నిర్మిస్తున్నారు.

- Advertisement -
   

ఈ మూవీకి జేబీ మ్యూజిక్‌ డైరెక్టర్‌..ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు కనిపించబోతున్నారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సీ కల్యాణ్‌ క్లాప్‌ కొట్టగా.. ప్రముఖ నిర్మాత కేఎస్‌ రవికుమార్‌ కెమెరా స్విఛాన్‌ చేశారు. పోకూరి బాబూరావు స్క్రిప్ట్‌ను డైరెక్టర్‌ ఏఎస్‌ రవికుమార్ చౌదరికి అందజేశారు. ఈ పూజా కార్యక్రమానికి కాశీ విశ్వనాథ్‌, వీర శంకర్‌, బెక్కెం వేణు గోపాల్‌, ప్రసన్న కుమార్‌, జీవితా రాజశేఖర్‌ హాజరయ్యారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement