Thursday, March 28, 2024

నాని మ‌రో మ‌ల్టీస్టార‌ర్ ..!

ఇప్ప‌టికే దేవ‌దాసు..నిన్నుకోరి చిత్రాల‌తో మ‌ల్టీస్టార‌ర్ మూవీలో న‌టించాడు నేచుర‌ల్ స్టార్ నాని.కాగా మరో మల్టీ స్టారర్ సినిమా చేయడానికి ఆయన ఓకే చెప్పినట్టుగా ఒక టాక్ నడుస్తోంది. కేజీఎఫ్’ సినిమాను నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ వారు పాన్ ఇండియా సినిమాగా ‘సలార్’ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత ప్రాజెక్టును వారు సుధ కొంగర దర్శకత్వంలో చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నట్టుగా సమాచారం. ఈ సినిమాలో సూర్య – దుల్కర్ నటించనున్నారని అంటున్నారు. ఈ సినిమాలో మరో హీరో పాత్ర కోసం నానిని సంప్రదించినట్టుగా చెబుతున్నారు. ఆల్రెడీ సుధ కొంగర కథ చెప్పడం .. ఆయన ఓకే చెప్పడం జరిగిపోయాయని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని చెబుతున్నారు. జోరుగా షికారు చేస్తున్న ఈ వార్తపై అధికారిక ప్రకటన రావలసి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement