Saturday, March 23, 2024

మరోసారి మహేశ్ బాబుతో.. మలైకా అరోరా

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు మాట‌ల మాంత్రికుడు, స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇటు మ‌హేష్ ఫ్యాన్స్‌తో పాటు ఆడియెన్స్ అంద‌రికీ న‌చ్చేలా అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగులున్న సినిమాగా SSMB 28ను గురూజీ తెర‌కెక్కిస్తున్నారు. రీసెంట్‌గానే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. SSMB 28లో క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌న్నింటినీ ద‌ట్టిస్తున్న త్రివిక్ర‌మ్ ఓ ఐటెమ్ సాంగ్‌ను యాడ్ చేస్తున్నార‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ లేవ‌నే చెప్పాలి. అయితే ఈసారి ఆయ‌న రూట్ మార్చేశారు. మ‌రి మ‌హేష్ సినిమాలో ఆయ‌న‌తో ఆడిపాడ‌బోయే ఐటెమ్ బ్యూటీగా ఎవ‌రినీ తీసుకోవాల‌ని మేక‌ర్స్ చాలా రోజుల పాటు ఆలోచిస్తున్నారు. ఈ క్ర‌మంలో ప‌లువురి బాలీవుడ్ హీరోయిన్స్‌పేర్లు వినిపించాయి. తాజాగా బాలీవుడ్ హాట్ బాంబ్ మలైకా అరోరా పేరు వినిపిస్తుంది. ఈమెకి తెలుగులో ఐటెమ్ సాంగ్స్ చేయ‌టం కొత్తేమీ కాదు.. అతిథి, గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రాల్లో ఆమె ఆడిపాడింది. ఆ పాట‌ల‌న్నీ హిట్ అయ్యాయి. అతిథి సినిమాలో మ‌హేష్‌తో రాత్రైనా నాకు ఓకే.. ప‌గ‌లైతే డ‌బుల్ ఓకే అంటూ ఆడి పాడిన ఈ ఐటెమ్ బ్యూటీ చాన్నాళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఆయ‌న క‌లిసి స్టెప్పులేయ‌నుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లోని టాక్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement