Friday, April 19, 2024

కృష్ణతో కలిసి 45చిత్రాల్లో నటించిన.. జయప్రద

కృష్ణతో కలిసిఎంతో మంది హీరోయిన్స్ ఆడి పాడారు.అయితే ఆయన సరసన ఎక్కువ సినిమాల్లో చేసిన ఘనత జయప్రదదే. కృష్ణతో కలిసి ఆమె ఏకంగా 45 చిత్రాల్లో నటించారు. ఒక హీరోతో ఓ హీరోయిన్ ఇన్ని చిత్రాల్లో నటించడం ఓ రికార్డు. ఆ ఘనత జయప్రదకే దక్కింది. ఎన్నో సందర్భాల్లో కృష్ణ తనకు అందించిన సహకారం గురించి జయప్రద గుర్తు చేసుకున్నారు. తాను పరిశ్రమలో అడుగుపెట్టినప్పుడు కృష్ణ తనకు ఎంతో సపోర్ట్ ఇచ్చారని ఆమె చెపుతుంటారు. బాపు దర్శకత్వం వహించిన విజయా సంస్థ నిర్మించిన ‘శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్’ చిత్రంలో కృష్ణ సరసన జయప్రద తొలిసారి నటించారు. ఈ చిత్రం ఊహించినంత విజయం సాధించలేనప్పటికీ కృష్ణ ఆమెకు అండగా నిలిచారు. తన తదుపరి చిత్రాల్లో వరుస ఆఫర్లు ఇస్తూ ఆమెను స్టార్ హీరోయిన్ ను చేశారు. వీరి కాంబినేషన్లో ఎన్నో హిట్ చిత్రాలు వచ్చాయి. వీరి కాంబినేషన్లో వచ్చిన పాటలు ఇప్పటికీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement