Thursday, April 25, 2024

షూటింగ్ లో గాయ‌ప‌డిన హీరో.. మోకాలికి ఆయుర్వేద చికిత్స

ఈ మ‌ధ్య‌కాలంలో ప‌లువురు హీరోలు సినిమా షూటింగ్స్ లో గాయ‌ప‌డుతున్నారు. కాగా తమిళ్ హీరో అరుణ్ విజయ్ షూటింగ్ లో గాయపడినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.ప్రస్తుతం ఆయన నటిస్తోన్న అచ్చం ఎన్బదు ఇల్లైయే సినిమా చిత్రీకరణ సమంయలో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇందులో అరుణ్ విజయ్ తోపాటు.. మరో వ్యక్తి కూడా గాయపడినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన మోకాలికి కాస్త ఎక్కువగానే ఎఫెక్ట్ అయినట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి.. కేరళలోని ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నారు. అందుకు సంబంధించిన ఫోటోస్ షేర్ చేస్తూ.. మోకాళ్లకు అయిన గాయానికి ఆయుర్వేద విధానంలో చికిత్స తీసుకుంటున్నాను. ఇది నాలుగోరోజు చికిత్స. త్వరలోనే షూటిం గ్ లో పాల్గొంటాన‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement