Thursday, April 18, 2024

ఏడాదికి 10 లక్షల వాహనాలను విడుదల చేయనున్న హీరో ఎలక్ట్రిక్‌..

భారతదేశంలోని తమ తయారీ యూనిట్ల నుంచి వచ్చే రెండు మూడు ఏళ్లో ఏటా 10 లక్షల వాహనాలను మార్కెట్‌లో విడుదల చేయబోతున్నట్లు హీరో ఎలక్ట్రిక్‌ బుధవాంర తెలిపింది. రూ.85,000-1.3 లక్షల మధ్య ధర కలిగిన మూడు ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మోడల్‌ల కొత్త వెర్షన్‌లను విడుదల చేసిన కంపెనీ, దాదాపు రూ. 1,200 కోట్ల పెట్టుబడితో 20 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో రాజస్థాన్‌లో గ్రీన్‌ఫీల్డ్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. దేశంలో పెరుగుతున్న డిమాండును తీర్చడానికి మేము మా భాగస్వాములతో కలిసి పని చేశాం. ఫలితంగా మేము మా తయారీ యూనిట్ల నుంచి 1 మిలియన్‌ వాహనాలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నామని మేనేజింగ్‌ డైరెక్టర్‌ నవీన్‌ ముంజాల్‌ అన్నారు.

- Advertisement -

కంపెనీ ఏడాదికి 10 లక్షల యూనిట్ల మార్కును ఎప్పుడు తాకగలదని అడిగిన ప్రశ్నకు సమాధానంగా, ఇది వచ్చే ఏడాదిలో ఉంటుందని ఆయన చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 1 లో యూనిట్ల విక్రయాలతో ముగుస్తుందని, 2023-24లో ఇది దాదాపు 2.5 లక్షల యూనిట్లుగా ఉండవచ్చిన అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన మార్కెట్‌ బలమైన వృద్ధిని సాధిస్తోందని, హీరో ఎలక్ట్రిక్‌ పదునైన వృద్ధి రేటుతో దూసుకుపోతుందని ఆయన అన్నారు. కంపెనీ ప్రస్తుతం లూథియానాలో కొత్త ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తోంది.

అంతేకాకుండా, మహీంద్ర గ్రూప్‌తో దాని వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా మధ్యప్రదేశ్‌లోని పింతపురాలో భాగస్వామ్య సౌకర్యం కోసం, కంపెనీ ఇప్పుడు 5 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యంతో ఉంది. హీరో ఎలక్ట్రిక్‌ రాజస్థాన్‌లో 20 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో గ్రీన్‌ఫీల్డ్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. గత 15 ఏళ్లలో మార్కెట్‌లో 6 లక్షల యూనిట్లకు పైగా విక్రయించింది. హీరో ఇటీవల తన కొత్త ఆప్టిమా సీఎక్స్‌ 5.0(డ్యూయల్‌ బ్యాటరీ), ఆప్టిమా సీఎక్స్‌ 2.0 (సింగల్‌ బ్యాటరీ) మోడళ్లను విడుదల చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement