Thursday, April 18, 2024

సార్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎక్కడంటే

వెంకీ అట్లూరి తెరకెక్కించిన చిత్రం సార్.ఈ చిత్రంలో హీరోగా తమిళ స్టా్ హీరో ధనుశ్ నటించాడు.ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. ఈ సినిమాలో ధనుశ్ లెక్చరర్ గా నటించాడు .. అదే కాలేజ్ పనిచేసే మీనాక్షి పాత్రలో సంయుక్త మీనన్ కనిపించనుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును ఫిబ్రవరి 15న హైదరాబాద్ .. నక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా లో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వదిలిన అప్ డేట్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. జీవీ ప్రకాశ్ కుమార్ స్వరపరిచిన పాటలు యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తమిళంలో ‘వాతి’ టైటిల్ తో ఈ సినిమా థియేటర్లకు రానుంది.కాలేజ్ నేపథ్యంలో .. విద్యా వ్యవస్థను కొంతమంది వ్యక్తులు ఎలా బిజినెస్ గా మారుస్తున్నారనే అంశాలపై ఈ కథ నడుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement